అఖిల్ మళ్లీ అదే డైలమానా..?

June 29, 2020


img

అక్కినేని నట వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టైటిల్ ఫిక్స్ చేశారు. టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ పిఎస్. మిత్రన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అభిమన్యుడు సినిమాతో ప్రతిభ చాటిన మిత్రన్ అఖిల్ తో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే మిత్రన్ సినిమా విషయంలో కూడా అఖిల్ కన్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మిత్రన్ చెప్పిన కథ బాగున్నా అది బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది డౌట్ పడుతున్నాడట. మరి అఖిల్ నెక్స్ట్ ఎవరితో ఉంటుంది అన్నది మళ్లీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదాక అక్కినేని ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పవు.Related Post

సినిమా స‌మీక్ష