మహేష్ కోసం సొంత బ్యాంక్..!

June 27, 2020


img

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ బాబు 27వ సినిమాను సర్కారు వారి పాట చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ సెటైర్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఓ బ్యాంక్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేయాలని అనుకున్నా మహేష్ మాత్రం జనవరి నుండి మొదలుపెట్టాలని అంటున్నాడట. 

సినిమా కథ ప్రకారం బ్యాంక్ సెట్ కంపల్సరీ అని డైరక్టర్ పరశురాం చెప్పాడట. నిర్మాతలు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సెట్ కు సంబందించిన వర్క్ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత తీస్తే స్టార్ హీరోతోనే సినిమా తీయాలన్న పరశురాం మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ సక్సెస్ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష