చిరు అప్సెట్ అయ్యాడా..?

June 05, 2020


img

తెలంగాణా ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల విషయమై తనని పిలవలేదని అసంతృప్తిని తెలియచేసిన నందమూరి బాలకృష్ణకు సినీ పరిశ్రమలో కొందరు సపోర్ట్ ఇస్తుండగా.. మరికొందరు మాత్రం చిరు తరపున మాట్లాడుతున్నారు. బాలకృష్ణ భూములు పంచుకుంటున్నారు అనడం.. దానికి నాగబాబు వీడియో చేయడం.. దానికి ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అనగానే ఛీ.. ఛీ.. అని తీసిపారేయడం.. ఈ ఎపిసోడ్ అంతా ఇండస్ట్రీలో ఉన్న గొడవలు బయటపడేలా చేస్తున్నాయి. 

ఈ మొత్తం ఎపిసోడ్ తో మెగాస్టార్ చిరంజీవి బాగా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నా చిరు అప్సెట్ వల్ల షూటింగ్ మరో రెండు నెలలు వాయిదా వేశారని తెలుస్తుంది. ఆచార్య సినిమా మళ్ళీ ఆగష్టులోనే మొదలవుతుందని టాక్. బాలకృష్ణ వ్యవహారంపై చిరు ఇంతవరకు స్పందించలేదు కానీ బాగా హర్ట్ అయ్యాడని అంటున్నారు. మరి ఈ విషయంపై చిరు ఎప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష