RRR మొదలుపెడుతున్నారా..!

June 01, 2020


img

కరోనా వల్ల గత మూడు నెలలుగా ఆగిపోయిన షూటింగ్స్ ను తగిన జాగ్రత్తలు తీసుకుని స్టార్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ముందు మొదలు పెడతారని అంటుండగా.. లేటెస్ట్ గా రాజమౌళి ట్రిపుల్ ఆర్ షూటింగ్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ రీ స్టార్ట్ చేస్తారట. మిగతా సినిమాల షూటింగ్స్ గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. 

జూలై నుండి దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ షూటింగ్స్ కూడా తక్కువ మందితోనే నడిపించాలని నిర్ణయించారు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్యతో పాటుగా పుష్ప ఇంకొన్ని పెద్ద సినిమాలు ముందు షూటింగ్స్ స్టార్ట్ చేస్తాయని అంటున్నారు. మరో రెండు నెలల్లో మిగతా సినిమాల షూటింగ్స్ కూడా మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 


Related Post

సినిమా స‌మీక్ష