బాలకృష్ణ ఇంటర్వ్యూ ప్రోమోతోనే సెన్సేషన్..!

June 01, 2020


img

ఈమధ్య సినీ పెద్దలు తెలంగాణా ప్రభుత్వంతో చేసిన చర్చలకు తనని పిలవలేదని సంచలన కామెంట్స్ చేసిన బాలకృష్ణ లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మామూలుగానే ఇంటర్వ్యూస్ కు దూరంగా ఉండే బాలకృష్ణ ఇలాంటి టైం లో ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా ఉన్న విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. జస్ట్ ప్రోమోనే వదిలారు కానీ ఆ ప్రోమోలోనే తన వ్యక్తిత్వం.. తన పూజలు.. తాను మాట్లాడే విధానం.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. ఈమధ్య జరిగిన ఇండస్ట్రీ మీటింగ్ అబ్బో చాలా విషయాలు ప్రస్తావించారు. 

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. బాలకృష్ణ ముందు ఈ ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టడం గొప్ప విషయం. మాములుగా ఎన్టీఆర్ టిడిపి ఎంట్రీ విషయంపై డైరెక్ట్ గా బాలకృష్ణ ఎప్పుడు ప్రస్తావించలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో దాని గురించి ఓపెన్ అయ్యాడు. ఇక తన పూజా విధానం గురించి చెప్పాడు. ఇండస్ట్రీలో తన స్థానం గురించి మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా అంటూ కామెంట్స్ చేశాడు. ఇక బాలకృష్ణ కామన్ గా చెప్పే డైలాగ్.. చరిత్ర సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా మేమె అన్న డైలాగ్ తో ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది. మొత్తానికి బాలయ్య బాబుని ఇలాంటి టైం లో ఈ హాట్ టాపిక్స్ గురించి ఇంటర్వ్యూస్ చేసి సమాధానాలు రాబట్టడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. 

బాలకృష్ణ లేటెస్ట్ ఫుల్ ఇంటర్వ్యూ మీకోసం.. 

Related Post

సినిమా స‌మీక్ష