వార్నర్ నుండి మరో మైండ్ బ్లాక్ సాంగ్

May 30, 2020


img

కరోనా వల్ల క్రికెట్ మ్యాచ్ లన్నీ రద్దవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఖాళీ టైంలో ఏం చేయాలో తోచక టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నాడు. ఆయనేదో వీడియోలు తీసుకుంటే మనకేంటి అనుకోవచ్చు.. వార్నర్ చేసే టిక్ టాక్ వీడియోస్ ఏంటి అంటే మన స్టార్స్ పాటలే.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సాంగ్ వరకు వదిలిపెట్టకుండా అన్ని చేసేస్తున్నాడు వార్నర్. 

మొన్నామధ్య పోకిరి సినిమాలో డైలాగ్ చెప్పి సర్ ప్రయిజ్ చేసిన వార్నర్ లేటెస్ట్ గా మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్ తో నిజంగానే మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. వార్నర్ లోని ఈ జోష్ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా తెలుగు హీరోల సాంగ్స్ మాత్రమే ఎందుకు అంటే ఐపీఎల్ లో వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ గా ఉంటున్నాడు. అందుకే అతనికి తెలుగు ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. మొత్తానికి రెస్పాన్స్ బాగుందని అనుకున్న వార్నర్ వరుస వీడియోలు చేస్తూ అదరగొట్టేస్తున్నాడు. 

@davidwarner31

After 50 attempts this was hard. Part two will be next if we get 500k likes. ##mindblock ##stepchallenge ##danceindia ##tiktok_india ##fy @candywarner31

♬ original sound - free_oxygen




Related Post

సినిమా స‌మీక్ష