మరో 'వర్మ' వచ్చాడుగా

May 28, 2020


img

మీరందరు ఇంట్లో రియల్ మెన్ ఛాలెంజ్ చేస్తే నేను సినిమా తీశా అంటూ మరోసారి తనదైన స్టైల్ లో షాక్ ఇచ్చిన ఆర్జీవీకి మరో వర్మ అదేనండి నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ షాక్ ఇచ్చాడు. లాక్ డౌన్ టైం లో ప్రశాంత్ వర్మ కూడా ఓ సినిమా చేసినట్టు తెలుస్తుంది. కరోనా వాక్సిన్ వస్తుంది. ప్రిలిమినరీ టెస్ట్ మే 29న ఉదయం 9 గంటలకు వస్తుందని ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా అ! తోనే ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత రాజశేఖర్ తో చేసిన కల్కి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. 

ఇక తన డైరక్షన్ లో వస్తున్న 3వ సినిమాగా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆర్జీవీ ఏకంగా ట్రైలర్ తో షాక్ ఇవ్వగా ఈ వర్మ ఎలాంటి సర్ ప్రయిజ్ ఇస్తాడో అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్జీవీ తీసిన కరోనా వైరస్ సినిమా త్వరలో రిలీజ్ అంటున్నారు. ఆర్జీవీ మూవీస్ అంటూ రామ్ గోపాల్ వర్మ సొంతంగా ఓటిటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. తన సినిమాలన్నీ ఇక దానిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. మరి వర్మ వర్సెస్ వర్మ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష