31న ముహూర్తం.. ఇది ఫిక్స్..!

May 20, 2020


img

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు పరశురామ్, మహేష్ సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నారట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. 

ఈ సినిమాలో మహేష్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ కోసం ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ సిద్ధం చేశాడట పరశురామ్. ఎలాగూ అతని డైలాగ్స్ లో పవర్ అందరికి తెలిసిందే. యువత సినిమా నుండి గీతా గోవిందం వరకుడైరక్షన్ లో తన టాలెంట్ చూపించిన పరశురామ్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మొన్నటివరకు యువ హీరోలను డైరెక్ట్ చేసిన పరశురామ్ మహేష్ సినిమా తర్వాత స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే. ఇక ఆ సినిమా హిట్టు కొడితే ఇక పరశురామ్ వెంట కూడా స్టార్స్ పడే అవకాశం ఉంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష