పవన్, రవితేజ మల్టీస్టారర్..?

April 06, 2020


img

కొద్దిపాటి గ్యాప్ తర్వాత పింక్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ హరీష్ శంకర్ తో కూడా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజ్ రవితేజ కాంబో మూవీ వస్తుందని అంటున్నారు. పవన్, రవితేజ మల్టీస్టారర్ మూవీ అంటే ఫ్యాన్స్ కు పండుగే. 

ఇద్దరికీ ఊర మాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కాంబో సినిమా దర్శకుడు ఎవరు. అసలు ఇది నిజం కానుందా అంటే డౌటే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎవరో కావాలని పవన్, రవితేజ కాంబో సినిమా అని న్యూస్ స్ప్రెడ్ చేశారు అంతేకాని ఈ మల్టీస్టారర్ ప్లాన్ అసలు చర్చల్లో లేదని అంటున్నారు. ఒకవేళ ఈ కాంబో సినిమా ఓకే అయితే మాత్రం రికార్డుల మోత మోగించడం ఖాయమని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష