రాజమౌళిలో నటుడు ఉన్నాడట..!

April 04, 2020


img

దర్శకధీరుడు రాజమౌళిలో నటుడు ఉన్నాడా.. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు స్వయానా రాజమౌళి చెప్పిన విషయమే ఇది. మాములుగా సీన్ ఎక్స్ ప్లైన్ చేసే టైం లో ఆర్టిస్టులకు వాళ్ళు నటించి చూపించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క దర్శకుడు చేసేదే.. అయితే రాజమౌళి మాత్రం సినిమా రిలీజ్ ముందు నటిస్తా అంటున్నాడు. అదేంటి అంటే భారీ బడ్జెట్ తో తీసే అతని సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అని టెన్షన్ బయటకు రాకుండా నటిస్తానని అంటున్నాడు. 

రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు సినిమా రిలీజ్ ముందు తాను నటిస్తా అంటూ సెన్సేషనల్ న్యూస్ బయట పెట్టాడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ కలిసి నటిస్తున్నారు. సినిమాలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదరగొట్టనున్నారు. రీసెంట్ గా రిలీజైన అల్లూరి సీతారామరాజు టీజర్ తారాస్థాయిలో అంచనాలు పెంచింది. Related Post

సినిమా స‌మీక్ష