RRR కోసం దిల్ రాజు డీల్..!

April 01, 2020


img

ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడు. నైజాంలో స్టార్ హీరోల సినిమాలు దిల్ రాజు కాదన్నాకే బయట వారికి వెళ్తాయి. ఈ సంక్రనాటికి రిలీజైన నాలుగు సినిమాలు నైజాం లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అది దిల్ రాజు భరించాల్సిందే. ఇక వచ్చే సంక్రాంతికి వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు దిల్ రాజు ముందే ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా మరో సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. 

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాకు దిల్ రాజు 75 కోట్లకు కోట్ చేశాడట.దాదాపు బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యిందని అంటున్నారు. బాహుబలి సినిమాను కూడా దిల్ రాజు భారీ రేంజ్ లో కొని అంతకు రెట్టింపు లాభాలు రాబట్టుకున్నాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కు ముందే జాగ్రత్త పడి నైజాం రైట్స్ కొనేసినట్టు తెలుస్తుంది. 2021 జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష