బుట్టబొమ్మకు కోలీవుడ్ ఛాన్స్..!

March 31, 2020


img

తెలుగులో ఓ రేంజ్ లో ఫామ్ కొనసాగిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ లాంటి స్టార్స్ తో నటిస్తుంది. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తమిళంలో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. మోడలింగ్ చేస్తున్న పూజా హెగ్డేకి మొదట ఛాన్స్ తమిళంలోనే వచ్చింది. ఆ తర్వాత తెలుగులో బిజీ అయ్యింది. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ అందుకుంది పూజా హెగ్డే. సింగం ఫేమ్ డైరక్టర్ హరి కాంబినేషన్ లో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. 

ఈ సినిమాకు అవువా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్రేజీ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డేకి ఛాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మూగమూడి మూగముడి సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మళ్ళీ 8 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మరి ఈ సినిమా హిట్ అయితే అమ్మడికి అక్కడ కూడా వరుస క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష