మహానటికి మహేష్ బాబు ఛాన్స్..!

March 26, 2020


img

సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా పరుశురాం డైరక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తుంది. అఫీషియల్ గా చెప్పడమే తరువాయి అన్నట్టుగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మళయాళ భామ ఆ సినిమా హిట్ అవడంతో వరుస ఛాన్సులు అందుకుంది. ఇక మహానటితో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగులో స్టార్ క్రేజ్ ఉన్నా తమిళ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది కీర్తి సురేష్. టాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలు రావట్లేదని కోలీవుడ్ స్టార్స్ తో జోడీ కడుతున్న అమ్మడు లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ మూవీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ కీర్తి సురేష్ జోడీ ప్రత్యేక ఆకర్షణగా రాబోతుంది. సినిమాకు సంబందించిన మిగతా కాస్త అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష