నిశ్శబ్దం డైరక్టర్ ఎవరు..?

March 21, 2020


img

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. మాధవన్, షాలిని పాండే, సుబ్బరాజు కూడా ఈ సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటించారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లో కోనా వెంకట్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు సంబందించి మొత్తం కోనా వెంకట్ బాధ్యత తీసుకున్నారట. డైరక్షన్ లో కూడా అతను వేలు పెట్టినట్టు తెలుస్తుంది. 

నిర్మాతగా కోనా వెంకట్ మొదటి ప్రాజెక్ట్ గీతాంజలి సూపర్ హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన శంకరాభరణం మాత్రం నిరాశపరచింది. ఇక హ్యాట్రిక్ మూవీగా నిశ్శబ్దం సినిమా నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు కథ అందించి సూపర్ హిట్లు అందుకున్న కోనా వెంకట్ నిశ్శబ్దం సినిమాను మొత్తం తానే డైరెక్ట్ చేశాడని తెలుస్తుంది. మరి కోనా అన్ అఫీషియల్ డైరెక్షనల్ ప్రాజెక్ట్ నిశ్శబ్దం రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఫలితం మీదే కోనా నెక్స్ట్ సినిమాలు ఆధారపడి ఉన్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష