RRR లో అలియా డౌటే..!

March 20, 2020


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకుందని చిత్రయూనిట్ చెబుతుండగా ఈ సినిమా నుండి హీరోయిన్ అలియా భట్ తప్పుకుంటుందన్న వార్త సంచలనంగా మారింది. సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించాల్సిన అలియా భట్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమాకు గుడ్ బై చెప్పేస్తుందట. 

బాలీవుడ్ లో చేస్తున్న గంగూబాయి సినిమా కోసమే ఆర్.ఆర్.ఆర్ ను అలియా లైట్ తీసుకుంటుందని అంటున్నారు. ఏప్రిల్ నుండి ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి జరుగుతుండటం వల్ల బాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పి ఆర్.ఆర్.ఆర్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉందట అలియా భట్. అలియా పై వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. Related Post

సినిమా స‌మీక్ష