చరణ్ తో విక్రం..?

February 25, 2020


img

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ తన సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తుందని ఎనౌన్స్ చేశాడు. ఎన్.టి.ఆర్ 30 సినిమా ఎనౌన్స్ మెంట్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. అరవింద సమేత తర్వాత తారక్, త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రోజుకో డైరక్టర్ పేరుతో చరణ్ సినిమా అంటూ చెప్పుకుంటున్నారు.   

రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ రాం చరణ్ తో సినిమా చేస్తాడని వార్తలు రాగా లేటెస్ట్ గా విక్రం సి. కుమార్ చరణ్ ను కలిసి ఓ కథ చెప్పాడట. చరణ్ కు లైన్ నచ్చిందని తెలుస్తుంది. 13బి, మనం, 24 తర్వాత విక్రం సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన హిట్ మాత్రం అందుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ నాని గ్యాంగ్ లీడర్ కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. మరి చరణ్ తో విక్రం సినిమా జరిగే పనా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష