వరల్డ్ ఫేమస్ లవర్ ఎంత లాస్ అంటే..!

February 25, 2020


img

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో విజయ్ నటించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మించారు. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా 23.81 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే సినిమాకు మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి.

ఇక లాస్ట్ ఫ్రై డే వచ్చిన నితిన్ భీష్మ సక్సెస్ అవడంతో భీష్మ కలక్షన్స్ ముగిశాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ 7.34 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా 9.17 కోట్లు మాత్రమే సాధించింది. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా కూడా నిరాశపరచింది. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు క్రాంతి మాధవ్ ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక విజయ్ తన వరకు తాను బాగానే చేసినా అక్కడక్కడ అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపించింది. అందుకే ఈ సినిమా విజయ్ కెరియర్ లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచింది.



Related Post

సినిమా స‌మీక్ష