నితిన్ భీష్మ కలక్షన్స్ అదుర్స్..!

February 24, 2020


img

యువ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక కలిసి నటించిన మూవీ భీష్మ. లాస్ట్ ఫ్రైడే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది. మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు  6.50 కోట్లు, రెండు రోజుల్లో 10 కోట్లు సాధించగా మూడు రోజుల్లో 14 కోట్ల దాకా వసూళ్లు చేసింది.

మరో ఒకటి రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కు చేరుకోగా.. నితిన్ భీష్మ డిస్ట్రిబ్యూటర్స్ వారంలోనే లాభాల బాట పట్టేలా ఉన్నారు. నితిన్ కెరియర్ లో కూడా ఈ సినిమా బెస్త్ హిట్ గా నిలిచేలా కనిపిస్తుంది. ఈ శుక్రవారం నాని నిర్మాతగా వస్తున్న హిట్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమా నితిన్ భీష్మ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష