విజయనిర్మల విగ్రహావిష్కరణ

February 20, 2020


img

కథానాయిక, దర్శకురాలు, నిర్మాత ఇలా సిని పరిశ్రమకు తన వంతు కృషి చేసిన విజయ నిర్మల ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా విజయ నిర్మల తనయుడు నరేష్ నానక్ రామ్ గూడలో విజయ నిర్మల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మహేష్, నమ్రతలు పాల్గొన్నారు.         

ప్రస్తుతం నరేష్ మా అధ్యక్షుడిగా ఉన్నారు. విజయ నిర్మల విగ్రహావిష్కరణలో కృష్ణతో పాటుగా మహేష్ కూడా మనసుని కదిలించే విధంగా మాట్లాడాడు. ఎప్పుడు తన సినిమా సక్సెస్ అయితే నాన్న మాట్లాడిన తర్వాత విజయ నిర్మల గారు మాట్లాడతారు. రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి నాన్న గారు మాట్లాడిన తర్వాత విజయ నిర్మల గారు మాట్లాడుతారని అనుకున్నా అని ఆమె మీద తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు మహేష్. Related Post

సినిమా స‌మీక్ష