ఎన్టీఆర్ 30 ఆయనతోనే ఫిక్స్

February 19, 2020


img

అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో అరవింద సమెత సినిమా చేశాడు తారక్. ఇప్పుడు ఈ కాంబోలో రెండో సినిమా రాబోతుంది. 

ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా అయినను పోయి రావలె హస్తినకు అన్నది పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ మొదలుపెట్టి 2021 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తారట. మరి తారక్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ క్రేజీ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష