RRR.. 'సీతా' 'రామరాజు' లుక్స్ లీక్..!

February 18, 2020


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడని తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రాం చరణ్, అలియా భట్ ఫోటోలు లీక్ అయినట్టు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, సీతగా అలియా భట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అల్లూరి రామరాజుగా ఉన్న ఆయన కాస్త సీత చెంత చేరి అల్లూరి సీతరామరాజుగా మారాడు. తెల్లోడు తుపాకీకి భయపడకుండా తన గుండెని ఉంచి వందేమాతర గీతంతో మృత్యువు ఒడిలోకి వెళ్లాడు అల్లూరి. ఇక కొరంత భీం కూడా అప్పటి రజాకుల మీద దండయాత్ర చేశాడు. ఇద్దరి రియల్ లైఫ్ సూపర్ హీరోస్ క్యారక్టర్స్ తో ఫిక్షనల్ కథగా ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ ఇయర్ రిలీజ్ అనుకున్న సినిమా కాస్త 2021 జనవరి 8కి వాయిదా వేశారు. మరి బాహుబలిని మించే సినిమాగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష