అక్కినేని హీరోతో సైరా డైరక్టర్

February 18, 2020


img

మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. సైరా సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన సూరి అసలైతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ సినిమా గురించి ఏమో కాని సురేందర్ రెడ్డి అక్కినేని యువ హీరో అఖిల్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడట. 

అఖిల్ మొదటి సినిమాను వినాయక్ డైరక్షన్ లో చేశాడు. ఆ తర్వాత రెండో సినిమా హలో విక్రం డైరక్షన్ లో ప్రయత్నించాడు. థర్డ్ మూవీని వెంకీ అట్లూరి డైరక్షన్ లో మిస్టర్ మజ్ ను అంటూ వచ్చాడు. అయితే ఈ మూడు ప్రయత్నాలు అఖిల్ కు సక్సెస్ ఇవ్వలేదు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి. అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష