బొక్కబోర్లా పడ్డ ఫేమస్ లవర్..!

February 17, 2020


img

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా బడ్జెట్ పాతిక కోట్ల దాకా కాగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా రిలీజైంది. అయితే మొదటి షోకే బాబోయ్ అని ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకు మూడు రోజుల్లో కేవలం 10 కోట్లు వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 20 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మౌత్ టాక్ కూడా చాలా దారుణంగా ఉంది. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాడని తెలుస్తుంది. ఎంతో అభిరుచి గల సీనియర్ నిర్మాత అయిన కె.ఎస్ రామారావు భారీగా నిర్మించినా సరే ఈ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయ్యింది. లాస్ట్ ఇయర్ డియర్ కామ్రేడ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరల్డ్ ఫెమస్ లవర్ కూడా నిరాశపరచింది. అందుకే ప్రస్తుతం పూరి డైర్క్షన్ లో సినిమాపై పూర్తిగా కాన్సెంట్రేట్ చేస్తున్నాడు విజయ్.Related Post

సినిమా స‌మీక్ష