నాని 'V' టీజర్.. ఇద్దరూ ఇద్దరే..!

February 17, 2020


img

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు లీడ్ రోల్స్ గా ఇంద్రంగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా వి. నాని పూర్తిస్థాయి నెగటివ్ రోల్ లో నటించిన ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. నెగటివ్ రోల్ లో నాని, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు ఇద్దరు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ఉన్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు దర్శకుడు మోహనకృష్ణ. 

సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో నెగటివ్ రోల్ లో నాని తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. వి టీజర్ లో నానితో పాటుగా సుధీర్ బాబు కూడా ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మ్ చేశాడని చెప్పొచ్చు. మార్చ్ 25న వస్తున్న ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచారు.

Related Post

సినిమా స‌మీక్ష