భీష్మ ట్రైలర్ : నితిన్ రొమాంటిక్ హిట్ కొట్టేలా ఉన్నాడు

February 17, 2020


img

యువ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. నితిన్, రష్మిక జంట చాలా బాగుంది. సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నితిన్ కు మంచి హిట్ ఇచ్చేలా ఉంది. ఛలో సినిమా తరహాలో భీష్మలో కూడా వెంకీ తన మాటలతో ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇక వరుస ఛాన్సులతో రష్మిక భీష్మ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష