భీష్మకు త్రివిక్రం సపోర్ట్

February 15, 2020


img

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న భీష్మ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తుంది. నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రం అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది. 

త్రివిక్రంతో ఆల్రెడీ అ..ఆ సినిమా చేశాడు నితిన్. అంతేకాదు భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల త్రివిక్రం దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. అందుకే భీష్మ సినిమాకు త్రివిక్రం సపోర్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న భీష్మ సినిమాపై నితిన్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

 


Related Post

సినిమా స‌మీక్ష