మహా సముద్రంకు సమంత నో

February 15, 2020


img

RX 100 తర్వాత మహా సముద్రం కథ పట్టుకుని చాలామంది హీరోల దగ్గరకు తిరిగాడు అజయ్ భూపతి. రామ్ నుండి నాగ చైతన్య వరకు కథ బాగుంది చేద్దాం అనడం ఆ తర్వాత వేరే కారణాల వల్ల తప్పుకోవడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా శర్వానంద్ కోసం ఈ స్క్రిప్ట్ లాక్ చేయడంతో ఇక సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అని అనుకున్నారు.

సినిమాలో హీరోయిన్ గా సమంతని ఓకే చేశారు. అయితే సమంత ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకుంది చైతు కోసమట. ఇప్పుడు చైతన్య ఈ సినిమా చెయ్యట్లేదు కాబట్టి సమంత కూడా కష్టమని అంటున్నారు. మంచి యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర రాసుకున్న అజయ్ హీరోయిన్ గా సమంత కావాలని అంటున్నాడట. సమంత మాత్రం ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. ఈమధ్యనే శర్వాతో కలిసి చేసిన జాను కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు అందుకే సమంత  మహా సముద్రం సినిమాకు నో చెప్పిందని టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష