మంచు మనోజ్ బిగ్ ఎనౌన్స్ మెంట్..!

February 13, 2020


img

2017 లో ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ లాస్ట్ ఇయర్ తన భార్య నుండి విడిపోతున్న విషయాన్ని కూడా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా తన సొంత బ్యానర్ లో వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేసిన మంచు మనోజ్ తన ప్రొడక్షన్ లో మొదటి సినిమాను ఎనౌన్స్ చేశాడు. అహం బ్రహ్మస్మి టైటిల్ తో మనోజ్ సినిమా వస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

మార్చ్ 6న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. టైటిల్ పోస్టర్ తో మంచు మనోజ్ సర్ ప్రైజ్ చేశాడు. ఇక మీదట తను పూర్తిస్థాయిలో సినిమాలు చేస్తానని తన ఫ్యాన్స్ కు మాటిచ్చిన మంచు మనోజ్ అహం బ్రహ్మస్మితో తన రీ ఎంట్రీ కన్ ఫర్మ్ చేశాడు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు తమిళ, హింది, కన్నడ, మళాయళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మంచు మనోజ్ భారీ ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.  Related Post

సినిమా స‌మీక్ష