నాగ చైతన్య కోసం నాగేశ్వర రావు

February 12, 2020


img

మజిలీ, వెంకీమామ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానుందట. 

సినిమాకు టైటిల్ గా నాగేశ్వర రావు అని ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. హీరోయిన్స్ గా కీర్తి సురేష్ ను తీసుకోనున్నారట. ఒకవేళ కీర్తి కుదరకపోతే రష్మిక మందన్నని ఫైనల్ చేస్తారట. గీతా గోవిందం సినిమాతో రష్మికకు సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్ చైతు సినిమాకు ఆమెను సెలెక్ట్ చేస్తే అలా కూడా  లక్ కలిసి వచ్చేలా ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష