రామ్ చరణ్.. రవితేజ.. మల్టీస్టారర్

February 11, 2020


img

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మాస్ మహారాజ్ రవితేజ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఈ ఐడియా ఏదో బాగుంది కదా.. అవును రామ్ చరణ్, రవితేజ కలిసి తమిళ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తారని తెలుస్తుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ఆ సినిమా తెలుగు రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ విక్రమ్ వేద తెలుగు హక్కులు పొందగా త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందట. 

గౌతమ్ అనే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. మరి నిజంగానే రవితేజ, చరణ్ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని తెలుస్తుంది. విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేద కోలీవుడ్ లో సంచలన విజయం అందుకుంది.


Related Post

సినిమా స‌మీక్ష