ప్రభాస్, పవన్, చిరు సినిమాల టైటిల్స్ ఇవేనా..?

February 07, 2020


img

సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ గురించి ఆ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తారు. టైటిల్స్ పెట్టిన సినిమాలకు ఫస్ట్ లుక్ పోస్టర్.. అది కూడా వస్తే టీజర్.. ఆ తర్వాత ట్రైలర్ ఇలా స్టార్ సినిమా ప్రతి అప్డేట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నా ఇప్పటివరకు టైటిల్స్ ఎనౌన్స్ చేయకపోతే మీడియాలో ఇష్టం వచ్చిన టైటిల్స్ ప్రచారంలో ఉంటాయి. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ 20వ సినిమా.. చిరు 152వ సినిమా.. పవన్ 26వ సినిమా టైటిల్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో మూడు టైటిక్స్ వైరల్ అవుతున్నాయి.

ముందు ప్రభాస్ సినిమా గురించి మాట్లాడితే.. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు అప్పట్లో జాన్ అనుకున్నా అది రాధే ష్యాం గా మార్చుతున్నారట. ఎందుకంటే 96 రీమేక్ గా వచ్చిన సినిమాను తెలుగులో జానుగా పెట్టారు. ఇక చిరు 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆచార్య అని ప్రచారంలో ఉంది. పింక్ రీమేక్ గా పవన్ చేస్తున్న సినిమాకు మొన్నటిదాకా లాయర్ సాబ్ అనే టైటిల్ వినిపించగా ఫైనల్ గా వకీల్ సాబ్ అని ఫిక్స్ చేశారట. ఇవి ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ అయినట్టుగా చెబుతున్నారు. ఏది ఏమైనా చిత్రయూనిట్ ప్రకటించనిదే ఇవే ఫైనల్ టైటిల్స్ అని చెప్పడం కష్టం.Related Post

సినిమా స‌మీక్ష