ప్రదీప్ హీరోగా.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?

January 25, 2020


img

టివి ఆన్ చేస్తే చాలు తన యాంకరింగ్ తో అలరించే ప్రదీప్ మాచిరాజు తన మార్క్ యాంకరింగ్ టాలెంట్ తో ఎలాంటి షో అయినా హిట్ చేస్తాడు. మేల్ యాంకర్స్ లో టాప్ రేంజ్ కి వెళ్లిన యాంకర్స్ లో ప్రదీప్ ఒకరు. రెగ్యులర్ షోలతో బిజీగా ఉండే ప్రదీప్ మాచిరాజు హీరోగా కొత్త టర్న్ తీసుకుంటుంన్నాడు. కొన్నాళ్లుగా ప్రదీప్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చినా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఫైనల్ గా ప్రదీప్ హీరోగా చేస్తున్న సినిమా గురించి అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది. 

మున్నా డైరక్షన్ లో ప్రదీప్ హీరోగా చేస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రానా రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రదీప్ లుక్ కూడా వెరైటీగా ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వెరైటీ టైటిల్ తో వెరైటీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష