కలక్షన్స్‌లో సరిలేరు నీకెవ్వరు...

January 21, 2020


img

మహేశ్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు మొదటిరోజే ‘సూపర్ హిట్’ టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా కలక్షన్లలో కూడా సరిలేరు నీకెవ్వరు అన్నట్లు దూసుకుపోతోంది. సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 10 రోజులైంది కనుక ఈ 10 రోజులలో కలక్షన్స్ ఒక్కసారి చూస్తే మహేశ్ బాబు స్టామినా ఏమిటో అర్ధమవుతుంది. 

ఉత్తరాంధ్ర: రూ. 17.07 కోట్లు 

ఉభయ గోదావరి జిల్లాలు: రూ.16.63 కోట్లు

కృష్ణా, గుంటూరు జిల్లాలు: రూ.17.00 కోట్లు 

నెల్లూరు జిల్లా: రూ.3.62 కోట్లు 

నైజాం: రూ.33.00 కోట్లు

సీడెడ్: రూ.14.65 కోట్లు     

రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 10.25 కోట్లు 

మొత్తం: రూ. 112.22 కోట్లు 

ఓవర్సీస్ కలక్షన్లు: 

అమెరికా: రూ.8.8 కోట్లు

గల్ఫ్ దేశాలలో: రూ.1.25 కోట్లు 

యూకె: రూ.0.35 కోట్లు 

సింగపూర్: రూ.0.4 కోట్లు 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్: రూ.0.9 కోట్లు 

మిగిలిన దేశాలలో: రూ. 0.5 కోట్లు 

మొత్తం: రూ.12.2 కోట్లు

ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకర, హీరో మహేశ్ బాబు కలిసి నిర్మించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ కెమెరా ముదుకు వచ్చిన సీనియర్ నటి విజయశాంతి తన నటనతో అందరినీ ఆకట్టుకొన్నారు. ఈ సినిమాలో రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రఘుబాబు, హరితేజ, సంగీత తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష