అల వైకుంఠపురములో తర్వాత అయిన పోయి రావలె హస్తినకు

January 18, 2020


img

సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎవరితో చేతాడన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం త్రివిక్రం రాం చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఈ సినిమాకు టైటిల్ గా అయినా పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ చేసే సినిమా ఇదే అంటున్నారు. అయితే మరోపక్క త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేస్తాడన్న వార్తలు వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు హీరో అన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన త్రివిక్రం తర్వాత సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నడని తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష