పూజా హెగ్దేని వదలని దిల్ రాజు

January 14, 2020


img

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు పూజ హెగ్దే. వరుసగా  స్టార్ అవకాశాలు అందుకోవడమే కాదు హిట్లు కూడా అందుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది.  లేటెస్ట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ కాగా మరోపక్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తుంది. 

ఇక ఈ సినిమాతో పాటుగా దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ డీజే సినిమా నుండి పూజ హెగ్దేకి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు దిల్ రాజు. మహేష్ మహర్శి సినిమాలో కూడా దిల్ రాజు నిర్మించగా ఆ సినిమాలో కూడా పూజ హెగ్దే నటించింది. పింక్ రీమేక్ లో కూడా పూజా ఫైనల్ అంటున్నారు. అది కూడా నిజమే అయితే ఇక తెలుగులో పూజ టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నట్టే. పింక్ తెలుగు వర్షన్ ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగా వాడుకుంటూ వస్తున్న పూజా హెగ్దే ఇక మీదట కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని ఆశిద్దాం. 


Related Post

సినిమా స‌మీక్ష