మళ్లీ వార్తల్లోకి ఆటోజానీ..!

January 10, 2020


img

ఇస్మార్ట్ శంకర్ తో ఫాంలోకి వచ్చిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. కేవలం తెలుగులోనే కాదు విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు పూరి. అందుకే సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను అడుగుతున్నారట. పాతిక కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని అంటున్నారు. చిరు 150వ సినిమా రేసులో ఉన్న పూరి అప్పుడు ఆయన కోసం ఆటోజానీ సినిమా కథ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో పూరిని కాదనేశాడు చిరంజీవి. ఇక ఇదిలాఉంటే పూరి ఫైటర్ తర్వాత చిరు ఆటోజానీ కథే తీస్తాడని అంటునారు. ఫైటర్ హిట్ అయితే పూరితో చిరు సినిమా చేసే అవకాశం కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష