భీష్మ టీజర్ వచ్చేస్తుంది..!

January 10, 2020


img

యువ హీరో నితిన్, ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీష్మ. నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను అలరించాయి. నితిన్, రష్మిక జంట అలరించేలా ఉండగా సినిమా నితిన్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈ నెల 12 ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారట.

నాగ శౌర్య ఛలో సినిమాతో తన ప్రతిభ చూపించిన వెంకీ కుడుముల నితిన్ తో భీష్మగా వస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరిలోనే 96 రీమేక్ గా వస్తున్న జాను, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఈ మూడు సినిమాల మధ్య క్లాష్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి.  Related Post

సినిమా స‌మీక్ష