ఇక్కడ 5, అక్కడ 6

January 10, 2020


img

సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి క్రేజీ కాంబోలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11 అనగా రేపు రిలీజ్ అవుతుంది. సంక్రాంతి హాలీడేస్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులు చూసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఏపిలో 6 షోలకు, తెలంగాణాలో 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఏపిలో రాత్రి 1 గంట నుండే షోలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణాలో మాత్రం ఉదయం 7 గంటలకు షోలు స్టార్ట్ అవుతాయి.

తెలుగు రెండు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా మాస్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ కూడా నటించారు. Related Post

సినిమా స‌మీక్ష