రంగమార్తాండ.. ఇద్దరు దర్శకులా..?

December 14, 2019


img

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ డైరక్షన్ లో మరాఠిలో సూపర్ హిట్టైన సినిమా నట సామ్రాట్ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో పాటుగా జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. 

ఈ సినిమాకు ప్రకాశ్ రాజ్ కేవలం ఆర్టిస్ట్ గానే కాకుండా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట. రంగమార్తాండ సినిమాకు ప్రకాశ్ రాజ్ ఓ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాడు. మరాఠీలో నానా పటేకర్ నటించి హిట్టు కొట్టగా తెలుగులో కూడా ఆ రేంజ్ హిట్టు కొట్టాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నారు. అందుకే ప్రకాశ్ రాజ్ ఈ సినిమాకు డైరక్షన్ డిపార్ట్ మెంట్లో కూడా పనిచేస్తున్నాడు. మరి ప్రకాశ్ రాజ్ డైరక్షన్ లో వేలు పెడుతున్నాడు అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష