కన్నడ సినిమా సీక్వల్ కు తెలుగులో సూపర్ క్రేజ్..!

December 14, 2019


img

కన్నడ నుండి వచ్చి సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన సినిమా కె.జి.ఎఫ్. అప్పటివరకు కేవలం శాండల్ వుడ్ కే స్టార్ అయిన యశ్ సౌత్ అంతటికి స్టార్ హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో దీనికి సీక్వల్ గా వస్తున్న సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారని తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఈ సీక్వల్ మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు సంబందించిన యశ్ ఫస్ట్ లుక్ ఈ నెల 21 న రిలీజ్ చేస్తున్నారని అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ వచ్చిందో లేదో తెలుగులో కూడా ఇది వైరల్ గా మారింది. కన్నడ సినిమా సీక్వల్ కు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ రేంజ్ లో ఎదురుచూడటం గొప్ప విషయమని చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కన్నడ సిని పరిశ్రమలో సంచలన విజయం అందుకోగా చాప్టర్ 2 మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష