పవర్ స్టార్ కు నో చెప్పిందా..?

December 14, 2019


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతావాసి తర్వాత సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమధ్య రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోనున్నాడు. కొన్నాళ్లుగా రెండు మూడు కథలు పవన్ చేస్తాడని అంటుండగా ఫైనల్ గా బాలీవుడ్ రీమేక్ కు పవన్ ఓకే చెప్పాడు. శుక్రవారం ఈ సినిమాకు ముహుర్తం పెట్టారు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్నారని తెలుస్తుంది. ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను అడిగారట కాని సమంత ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ ఛాన్స్ నే చేయనందా అంటే ఆల్రెడీ అత్తారింటికి దారేది సినిమలో పవన్ తో నటించిన సమంత పింక్ రీమేక్ కు మాత్రం చేయలేనని చెప్పిందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష