గీతా ఆర్ట్స్ లో యువ హీరో.. లక్కీ ఛాన్స్..!

December 06, 2019


img

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చైల్డ్ ఆర్టిస్టు నుండి సినిమాలు చేస్తున్నాడు.. హ్యాపీడేస్ లో హీరో ఫ్రెండ్ పాత్రలో అలరించిన నిఖిల్ హీరోగా కూడా తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్నాడు. స్వామిరారా తర్వాత పంథా మార్చుకున్న నిఖిల్ ఎప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడు. లేటెస్ట్ గా అర్జున్ సురవరం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. కొన్నాళ్ళుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన అర్జున్ సురవరం సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి మెప్పు పొందింది. 

ఇక ఈ సినిమాకు తనంతట తానుగా వచ్చి సపోర్ట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరు రాకతో సినిమాపై ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. అయితే ఆ వేడుకలో చిరుపై తన ప్రేమని ఆవిష్కరించాడు నిఖిల్. తన అభిమానంతో మెగాస్టార్ ను మెప్పించడంతో మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణంలో నిఖిల్ ఆఫర్ అందుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మాతగా నిఖిల్ సినిమా తెరకెక్కుతుంది. కుమారి 21f తో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీకి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మెగా కాంపౌండ్ లో పడ్డాడు కాబట్టి నిఖిల్ దశ తిరిగిపోతుందని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష