డిస్కో రాజా టీజర్.. రవితేజ ఈసారైనా కొడతాడా..!

December 06, 2019


img

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా డిస్కో రాజా. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తాళ్లూరి రజని ఈ సినిమా నిర్మిస్తున్నారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొదట్లో డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాను 2020 జనవరి 24కి వాయిదా వేశారు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.

టీజర్ చూస్తే కచ్చితంగా రవితేజ ఈసారి గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ ఒక్క క్షణంతో నిరాశపరచినా రవితేజ డిస్కో రాజా సినిమాతో మాత్రం పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడు. టీజర్ లో సస్పెన్స్ మెయింటైన్ చేశాడు దర్శకుడు. వరుసగా 3 ఫ్లాపులు ఎదుర్కున్న రవితేజకు డిస్కో రాజా హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.





Related Post

సినిమా స‌మీక్ష