నాని... 'టక్ జగదీశ్'

December 05, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమాకు టక్ జగదీశ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాని నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ మొదటి సినిమా హిట్టు కొట్టడమే కాకుండా రెండో సినిమా మజిలీ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

శివ నిర్వాణ 3వ సినిమాలో  నాని హీరోగా చేస్తున్నాడు. సినిమా టైటిల్ టక్ జగదీశ్ అని పెట్టడం వెరైటీగా ఉంది. ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తుందట. నాని తో శివ నిర్వాణ చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. వి షూటింగ్ దాదాపు చివరిదశకు రాగా టక్ జగదీశ్ షూటింగ్ లో పాల్గొననున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష