100 మిలియన్స్ మెచ్చిన సామజవరగమన..!

December 02, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి రిలీజైన మొదటి సాంగ్ సామజవరగమన సూపర్ హిట్ అయ్యింది.

సిద్ శ్రీరాం ఆలపించిన సామజవరగమన పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ లో సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది సామజవరగమన. ఈ సాంగ్ ఆడియోనే కాదు వీడియో కూడా అదిరిపోద్దని అంటున్నారు చిత్రయూనిట్. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. Related Post

సినిమా స‌మీక్ష