జస్టిస్ ఫర్ దిషా.. మేము మగాళ్లం.. మృగాళ్లం నమ్మొద్దంటున్న సుకుమార్..!

December 02, 2019


img

కామాంధుల చేతుల్లో బలైన దిషా ఘటనకు నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందే అంటున్నారు అందరు. సిని సెలబ్రిటీస్ సైత జస్టిస్ ఫర్ దిషా కోసం తన స్పందన తెలియచేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మహిళలు, ఆడవాళ్లు ఆఖరికి తండ్రిని, అన్నని నమ్మొద్దని.. అనుమానం రాగానే వెంటనే 100కి డయల్ చేయండని అన్నాడు.     

మేము మగాళ్లం కాదమ్మా.. మృగాళ్లమని దిషా ఘటనపై చాలా ఎమోషనల్ అయ్యాడు సుకుమార్. ఆమెపై ఈ ఘటన జరిగే సమయంలో తను ఏ విధంగా ఆలోచించి ఉంటుందో అని అనుకుంటేనే చాలా బాధగా ఉందని అన్నారు సుకుమార్. మహిళలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు. జస్టిస్ ఫర్ దిషా గురించి మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ లో స్పందించారు. ఓ వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విషయంపై చిరంజీవి కూడా వీడియో మెసేజ్ ఇచ్చారు. సిని ప్రముఖులందరు ఈ ఘటనపై తమ ఆవేదనను వెళ్లడించారు. Related Post

సినిమా స‌మీక్ష