తెలుగు సినిమాకి తెలుగు రీమేక్..!

November 20, 2019


img

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా తెరంగేట్రం చేసింది. ఇద్దరు కొత్తవారే అయినా దొరసాని సినిమాలో మంచి అభినయాన్ని కనబరిచారు. ఇక రౌడీ హీరో తమ్ముడిగా ఆనంద్ కు కూడా హీరోగా పాస్ మార్కులు పడినట్టే. ప్రస్తుతం ఆనంద్ రెండో సినిమా చేస్తున్నాడు. 

ఇక లేటెస్ట్ గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెలుగులో హిట్టైన తాళి సినిమా రీమేక్ చేస్తున్నారట. ఈవివి సత్యనారాయణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీంకాత్ హీరోగా చేశాడు. అదేంటి ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమా ఎలా రీమేక్ చేస్తారని అనుకోవచ్చు. అయితే అదే సినిమాను ఇప్పటి జెనరేషన్ కు తగినట్టుగా మార్పు చేస్తారట. ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ కెరియర్ కూడా స్ట్రాంగ్ గా చేసేలా విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.  



Related Post

సినిమా స‌మీక్ష