'దొంగ' టీజర్.. ఒక వ్యక్తికి ఇన్ని పేర్లా..?

November 16, 2019


img

దృశ్యం సినిమాతో సౌత్ అన్నిభాషల్లోనే కాదు బాలీవుడ్ లో కూడా హిట్ అందుకున్న దర్శకుడు జీతు జోసెఫ్. ప్రస్తుతం అతను కార్తి హీరోగా తమిళంలో చేస్తున్న సినిమా తంబి. ఈ సినిమాను తెలుగులో దొంగగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబందించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. దొంగగా కార్తి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పేరుతో కేస్ ఫైల్ అయ్యి ఉంటుంది. అలాంటి కార్తి ఎలా మారాడు అన్నది సినిమా కథ.  

ఈ సినిమాలో జ్యోతిక తమ్ముడిగా కార్తి నటిస్తున్నాడు. టీజర్ ఆసక్తికరంగా ఉండగా కార్తి ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. ఈమధ్యనే ఖైది సినిమాతో హిట్ అందుకున్న కార్తి దొంగగా కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాడు. జీతు జోసెఫ్ కథ కథనాలే సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. త్వరలో రిలీజ్ అవనున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష