నిన్న 'ఖైది'.. నేడు 'దొంగ'

November 15, 2019


img

రీసెంట్ గా ఖైదిగా వచ్చి హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో కార్తి ఇప్పుడు దొంగ అంటూ కొత్త సినిమా పోస్టర్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. దృశ్యం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న జీతు జోసెఫ్ డైరక్షన్ లో తమిళంలో తంబిగా వస్తున్న ఈ సినిమాను తెలుగులో దొంగగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో సూర్య రిలీజ్ చేశారు.  

ఈ సినిమాలో సూర్య వైఫ్ జ్యోతిక కూడా నటిస్తుంది. జ్యోతిక తమ్ముడి పాత్రలో కార్తి నటిస్తున్నాడు. కార్తి, జ్యోతిక కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై తమిళంలో సూపర్ క్రేజ్ ఏర్పడింది. సినిమాలో నిఖిల విమల్, సత్యరాజ్ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఖైది సినిమాతో తెలుగులో మళ్లీ ఫాం లోకి వచ్చిన కార్తి దొంగతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ దొంగ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాడో లేదో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష