బాలీవుడ్ రీమేక్ లో నాగ చైతన్య

November 15, 2019


img

మజిలీ హిట్ తో నాగ చైతన్య కెరియర్ లో జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం బాబి డైరక్షన్ లో వెంకటేష్ తో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య బాలీవుడ్ రీమేక్ లో నటిస్తాడని తెలుస్తుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిచోరే సినిమా రీమేక్ లో చైతు నటిస్తున్నాడట. ఈ సినిమాను గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుందు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా సరే పరశురాంకు ఏ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్ గా రీమేక్ సినిమాకు డైరక్షన్ ఛాన్స్ వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉంటుందో చూడాలి.      

 


Related Post

సినిమా స‌మీక్ష